News

చైర్మన్ ఘంటా చక్రపాణి ఆవేదన


పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆవేదన లో అర్దం ఉంది.ఆయనను ఎక్కడకు వెళ్లినా ఉద్యోగాల గురించి అడుగుతున్నారట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా తెలంగాణకు ఏర్పడినా ఎందుకు ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు, రాజకీయ నేతలు విమర్శిస్తుంటారు.దీనిపై ఒక కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడుతూ తమను అనవసరంగా బద్నామ్ చేస్తున్నారని , అది సరి కాదని అన్నారు.ఉద్యోగాలు ఇవ్వడం తన చేతిలో లేదని , ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వాటిని అమలు చేయడమే తమ పని అని ఆయన అన్నారు. తాము జాబ్ ప్రొవైడర్స్ కామని, జాబ్ సెలక్టర్స్ మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు.